logo

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కేసులు

ఎరువులు, క్రిమి సంహారక రసాయనాలను నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే సదరు దుకాణదారులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని

Published : 23 Jan 2022 03:24 IST

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌ : ఎరువులు, క్రిమి సంహారక రసాయనాలను నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే సదరు దుకాణదారులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం నిర్వహించారు. పలువురు సలహా మండలి సభ్యులు ఎరువులు, పురుగు నివారణ మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. జిల్లా సలహా మండలి ఛైర్మన్‌ జన్ను రాఘవరావు మాట్లాడుతూ.. ఇటీవల తెగుళ్ల కారణంగా మిరప రైతులు, తాజాగా అకాల వర్షాలతో మినుము తదితర పంటలు వేసిన రైతులు నష్టపోయినట్టు తెలిపారు. నష్ట పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యుడు గోగినేని పెరుమాళ్లు మాట్లాడుతూ.. కోసూరు, వడ్లమన్నాడు గ్రామాల్లో పశు వైద్యులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. కలెక్టర్‌ స్పందిస్తూ.. అక్కడ సిబ్బందిని నియమించాలని పశుసంవర్ధక శాఖ జేడీని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో జేసీ మాధవీలత, జడ్పీ సీఈవో సూర్యప్రకాశరరావు, జేడీఏ మోహనరావు, సభ్యులు నాగేశ్వరరావు, పెన్నేరు ప్రభాకరరావు, సయ్యద్‌ నాగుల్‌ మీరా, పట్టపు శ్రీనివాసరావు, బ్రహ్మయ్య, దామోదర్‌రెడ్డి, రామచంద్రరావు, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని