ఎస్పీలు × డీఐజీ
రేంజ్ పోలీసుల క్రీడా పోటీల్లో భాగంగా గుంటూరు జేకేసీ కళాశాలలో శనివారం డీఐజీ ఎలెవన్ వర్సస్ ఎస్పీల జట్ల మధ్య క్రికెట్ పోటీ జరిగింది. గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు ఆరిఫ్ హఫీజ్, విశాల్‌గున్నీ ఒక జట్టులో, ఒక
క్రికెట్ పోటీలో ఉల్లాసపరిచిన పోలీసు అధికారులు
బౌలింగ్ చేస్తున్న గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : రేంజ్ పోలీసుల క్రీడా పోటీల్లో భాగంగా గుంటూరు జేకేసీ కళాశాలలో శనివారం డీఐజీ ఎలెవన్ వర్సస్ ఎస్పీల జట్ల మధ్య క్రికెట్ పోటీ జరిగింది. గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు ఆరిఫ్ హఫీజ్, విశాల్‌గున్నీ ఒక జట్టులో, ఒక జట్టులో డీఐజీ త్రివిక్రమవర్మ, నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఆడి ఉల్లాసపరిచారు. ఫ్రెండ్లీ మ్యాచ్ కావడంతో డీఐజీ ఇరు జట్ల వైపు బ్యాటింగ్ చేశారు. తొలుత డీఐజీ జట్టు బ్యాటింగ్‌కు దిగి 163 పరుగులు చేసింది. అనంతరం ఎస్పీల జట్టు తరపున అర్బన్, రూరల్ ఎస్పీలతోపాటు మరికొందరు పోలీసు అధికారులు ఆడారు. తొమ్మిది పరుగుల తేడాతో డీఐజీ ఎలెవన్ జట్టు విజయం సాధించింది.
బ్యాటింగ్ చేస్తున్న డీఐజీ త్రివిక్రమ వర్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!