logo

తొక్కకుండానే ఈ సైకిల్‌రయ్‌.. రయ్‌!

ఆ వాహనం మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది. అదే డూడుల్‌ ఈ-బైక్‌ కమ్‌ సైకిల్‌. పిల్లల నుంచి పెద్దల వరకు ఇట్టే ఆకర్షితులవుతారు. పెట్రోల్‌ ధర సెంచరీ మార్కు దాటేసింది. ఈ తరుణంలో ఎలక్ట్రిక్‌ బైక్‌లకు ఆదరణ పెరుగుతుంది.

Published : 23 Jan 2022 04:01 IST

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే

ఆ వాహనం మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది. అదే డూడుల్‌ ఈ-బైక్‌ కమ్‌ సైకిల్‌. పిల్లల నుంచి పెద్దల వరకు ఇట్టే ఆకర్షితులవుతారు. పెట్రోల్‌ ధర సెంచరీ మార్కు దాటేసింది. ఈ తరుణంలో ఎలక్ట్రిక్‌ బైక్‌లకు ఆదరణ పెరుగుతుంది. ఈ కోవలోకే వచ్చేది ఈ-బైక్‌. చూసేందుకు ఇది సైకిల్‌లా ఉన్నప్పటికీ ద్విచక్ర వాహనాల్లో ఉండే ప్రత్యేకతలన్నీ ఈ వాహనంలో ఉన్నాయి.  మడుచుకుని ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకువెళ్లే సౌలభ్యం సొంతం. కేంద్ర ప్రభుత్వం పర్యావరణానికి మేలు చేసేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తుంది. భవిష్యత్తులో ఈ-బైక్‌ కమ్‌ సైకిల్‌ తరహా వాహనాలే మార్కెట్లో అధికంగా ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

పెట్రోల్‌ వద్దు.. ఎలక్ట్రిక్‌ వాహనాలే ముద్దు..

కాలానికి తగ్గట్టుగా మార్కెట్లోకి వస్తున్న కాలుష్య రహిత వాహనాలను కొనుగోలు చేసి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉంది. ఇందులో భాగంగానే గుంటూరు గుజ్జనగుండ్లకు చెందిన వడ్డాది సుభాష్‌చంద్ర డూడుల్‌ ఈ-బైక్‌ కమ్‌ సైకిల్‌ను గతేడాది అక్టోబర్‌లో కొనుగోలు చేశారు. ఆయన తనతో పాటు పిల్లలకు కలిపి రెండు వాహనాలను తీసుకున్నారు. గతంలో నెలకు పెట్రోల్‌ కోసం రూ.3,500 వరకు ఖర్చు పెట్టక తప్పేది కాదని, ఇప్పుడా పరిస్థితి లేదని, ఉదయం వేళ ఈ-బైక్‌ను సైకిల్‌ వలే వినియోగించుకోడంతో వ్యాయామం చేస్తున్నట్లవుతుందని, రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉంటుందని సుభాష్‌ చంద్ర వివరించారు. గుంటూరు, విజయవాడల్లో మొట్టమొదటిగా ఈ-బైక్‌ కమ్‌ సైకిల్‌ను కొనుగోలు చేసింది తానేనని, ఆ తర్వాత విజయవాడలో నా స్నేహితులు కొనుగోలు చేశారని వెల్లడించారు.

బోలెడు ప్రత్యేకతలు..

* అల్యూమినియం ఫ్రేమ్‌. బైక్‌పై లైఫ్‌టైమ్‌ వారంటీ
* 10.4 ఎ.హెచ్‌ లిథియం ఇయాన్‌ బ్యాటరీ. బ్యాటరీ వారంటీ సంవత్సరం
* గరిష్ఠంగా 45,000 కిలోమీటర్లు బ్యాటరీ మన్నిక ఉంటుంది.
* ఛార్జింగ్‌ సమయం మూడు గంటలు
* గరిష్ఠ వేగం 25 కిలోమీటర్లు గంటకు
* 28.5 కేజీల బరువు
* మడుచుకుని వాహనాన్ని ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకువెళ్లవచ్చు
* ప్రత్యేక టైర్లతో రోడ్డు గ్రిప్‌ బాగుంటుంది.
* ముందు, వెనుకా... రెండు డిస్క్‌ బ్రేకులు ఉంటాయి.
* ఏడు గేర్లతో ఇది పని చేస్తుంది.
* ఛార్జింగ్‌ ఎంత ఉంది. ఎంత వేగంతో ప్రయాణిస్తున్నామో డిజిటల్‌ స్క్రీన్‌ ద్వారా చూసుకునే సౌలభ్యం
* ఈ వాహనం ధర రూ.81,000
* సీటు, హ్యాండిల్స్‌ కూడా ఎంత కావాలంటే అంతకు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. దీనివల్ల పిల్లలకు సౌలభ్యంగా ఉంటుంది.


లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు

మడచి పెట్టొచ్చు

గరిష్ఠ వేగం గంటకు 25 కిలోమీటర్లు కావడంతో ఈ వాహనానికి రిజిస్ట్రేషన్‌ చేయించాల్సిన అవసరం ఉండదు. లైసెన్స్‌ తీసుకోవాల్సిన పని కూడా లేదు. పత్రాలు తీసుకుని రవాణా శాఖ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన జంజాటం అంతకంటే ఉండదు. డబ్బు ఆదా అవుతుంది. తక్కువ వేగంతో ప్రయాణించడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు తక్కువ. అత్యాధునికంగా.. మోడల్‌గా ఉండటంతో పిల్లలు, టీనేజర్లు ఇట్టే ఇష్టపడతారు. నడపడం కూడా చాలా తేలికగా ఉంటుంది.

- వడ్డాది సుభాష్‌చంద్ర, గుజ్జనగుండ్ల, గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని