logo

ఉపాధి పనులపై సంతృప్తి

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో చేసిన పనులను పరిశీలించిన జాతీయ పర్యవేక్షక కేంద్ర బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 17 నుంచి 22 వరకు జిల్లాలోని

Published : 23 Jan 2022 04:01 IST

జిల్లా కలెక్టరు వివేక్‌యాదవ్‌తో సమావేశమైన కేంద్ర బృంద అధికారులు వినయ్‌ గారడే, అనిల్‌ గైక్వాడ్‌

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో చేసిన పనులను పరిశీలించిన జాతీయ పర్యవేక్షక కేంద్ర బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 17 నుంచి 22 వరకు జిల్లాలోని వివిధ గ్రామాలను సందర్శించి పనులను తనిఖీ చేశారు. శనివారం గుంటూరులోని బంగ్లాలో కలెక్టరు వివేక్‌ యాదవ్‌తో కేంద్ర బృందం సభ్యులు వినయ్‌ గారడే, అనిల్‌ గైక్వాడ్‌ సమావేశమయ్యారు. జిల్లాలో ఉపాధి పనులు, పీఎంఏవై పనుల గురించి చర్చించారు. సమావేశంలో జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టరు యుగంధర్‌కుమార్‌, జిల్లా పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య, గృహనిర్మాణసంస్థ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని