logo

పూరిల్లు.. రూ.11 వేలకు పైగా బిల్లు

నకరికల్లు మండలం నర్శింగపాడుకు చెందిన ఎ.అంకయ్య కొన్నేళ్లుగా ఆర్‌అండ్‌బీ స్థలంలోని ఒక పూరిల్లులో ఉంటున్నారు. కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి ఇంటికి రూ.11,689 బిల్లు చెల్లించాలంటూ విద్యుత్తు సరఫరా నిలిపివేశారని వాపోయారు.

Published : 24 Jan 2022 04:12 IST


పాక వద్ద బాధితుడు అంకయ్య * అంతరచిత్రంలో కరెంటు బిల్లు

నకరికల్లు, న్యూస్‌టుడే: నకరికల్లు మండలం నర్శింగపాడుకు చెందిన ఎ.అంకయ్య కొన్నేళ్లుగా ఆర్‌అండ్‌బీ స్థలంలోని ఒక పూరిల్లులో ఉంటున్నారు. కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి ఇంటికి రూ.11,689 బిల్లు చెల్లించాలంటూ విద్యుత్తు సరఫరా నిలిపివేశారని వాపోయారు. ఎస్సీ కేటగిరీ కింద ఉన్న కనెక్షన్‌కు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా అవుతుందని తెలిపారు. 2019 ముందు నుంచి బకాయి ఉందంటూ సిబ్బంది చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై విద్యుత్తు శాఖ డానియేల్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా పాత బకాయిలు పేరుకుపోవడంతో విద్యుత్తు సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని