logo

12 నుంచి పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు

వచ్చే నెల 12, 13 తేదీల్లో నగరంలోని ఎన్జీవో కల్యాణ మండపంలో నిర్వహించనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర 22వ మహాసభలను విజయవంతం చేయాలని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, నల్లమడ రైతు

Published : 24 Jan 2022 04:12 IST


గోడప్రతులు ఆవిష్కరిస్తున్న రాజమోహన్‌, రామకృష్ణ, గనిరాజు, బ్రహ్మయ్య, నరసింహారావు, సాంబయ్య, ప్రసాద్‌, నీలాంబరం, ఝాన్సీ, సాహస

లాడ్జిసెంటర్‌, న్యూస్‌టుడే: వచ్చే నెల 12, 13 తేదీల్లో నగరంలోని ఎన్జీవో కల్యాణ మండపంలో నిర్వహించనున్న ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర 22వ మహాసభలను విజయవంతం చేయాలని మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, నల్లమడ రైతు సంఘం నాయకుడు డా.కొల్లా రాజమోహన్‌ కోరారు. స్థానిక మాదాల నారాయణ స్వామి భవనంలో ఆదివారం పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపద కార్పొరేట్ల పరమవుతోందని, పేదరికం, ఆకలి చావులు, నిరుద్యోగం, ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు వంటి పరిశ్రమలు ప్రైవేట్‌ పరం కాకుండా విద్యార్థులు పోరాడాలన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, గనిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మయ్య, ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కో కన్వీనర్‌ నరసింహారావు, బహుజన చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తన్నీరు సాంబయ్య, సీనియర్‌ అడ్వొకేట్‌ ప్రసాద్‌, బీంసేన సేవాదళ్‌ అధ్యక్షుడు నల్లపు నీలాంబరం, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు సునీల్‌, ఝాన్సీ, సాహస తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని