మత్తు ముఠా గుట్టు రట్టు!
మత్తు పదార్థాలు, గంజాయి విక్రయం, వినియోగం కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్ఈబీ భీమవరం సీఐ వీవీవీఎస్‌ఎన్ వర్మ ఆదివారం వెల్లడించారు. పట్టుబడినవారిలో విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం
భీమవరంలో ముగ్గురి అరెస్టు
నిందితుడి అరెస్టు చూపుతున్న ఎస్ఈబీ అధికారులు
భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మత్తు పదార్థాలు, గంజాయి విక్రయం, వినియోగం కేసుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్ఈబీ భీమవరం సీఐ వీవీవీఎస్‌ఎన్ వర్మ ఆదివారం వెల్లడించారు. పట్టుబడినవారిలో విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరానికి చెందిన సింగుదాసు రిత్విక్ నుంచి ఎండీఎంఏ అనే మత్తు మందు ఒక గ్రాము, ఐదు టాబ్లెట్లు, 20 గ్రాముల గంజాయి, గుంటూరుకు చెందిన ఉయ్యాల రోహిత్ (ఇతడు కొన్నేళ్లుగా భీమవరంలోనే ఉంటున్నాడు) ఎల్ఎస్డీ మత్తు పదార్థం, పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన భూపతిరాజు రాజా ఉపేంద్ర నుంచి 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
బెంగళూరు కేంద్రంగా.. : బెంగళూరుకు చెందిన వ్యక్తి వీరికి మత్తు పదార్థాలు అందిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. ఉయ్యాల రోహిత్‌ను గుంటూరులో పట్టుకున్నట్లు తెలిసింది. అతడ్ని విచారించగా మరికొందరి పేర్లును వెల్లడించడంతో ప్రత్యేక బృందం ఈ నెల 22న భీమవరం చేరుకుంది. స్థానిక ఎస్ఈబీ అధికారులతో కలిసి లాడ్జిలో ఉండి పట్టుబడిన యువకుడితో మిగిలిన వారికి సమాచారం ఇప్పించి వలపన్ని పట్టుకున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!