logo

డ్రైవింగ్‌ పాఠశాలకు రూ.42 లక్షల నిధులు

బాపులపాడు మండలం అంపాపురంలో కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధునాతన డ్రైవింగ్‌ పాఠశాలకు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ రూ.42,77,500 నిధులు కేటాయించారు. శిక్షణ పూర్తి చేసుకున్న

Published : 24 Jan 2022 05:41 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: బాపులపాడు మండలం అంపాపురంలో కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అధునాతన డ్రైవింగ్‌ పాఠశాలకు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ రూ.42,77,500 నిధులు కేటాయించారు. శిక్షణ పూర్తి చేసుకున్న చోదకులకు ధ్రువ పత్రాలు అందజేయడం కోసం ఎంపీ ఇటీవల పాఠశాలకు వచ్చారు. ఈ సందర్భంగా లారీ యజమానుల సంఘం నాయకులు, హెవీ మోటారు వెహికల్‌ సిములేటర్‌ ఏర్పాటు కోసం ఎప్పట్నుంచో కృషి చేస్తున్నామని, దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆయన దీనికి అవసరమైన నిధుల్ని తన కోటా నుంచి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకనుగుణంగా అవసరమైన మంజూరు పత్రాలు కూడా రవీంద్రకుమార్‌ జారీ చేసినట్లు సంఘం నాయకులు తుమ్మల లక్ష్మణస్వామి, గోపిశెట్టి వీరవెంకయ్య, వై.వి.ఈశ్వరరావు, ప్రిన్సిపల్‌ రాజారావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని