logo

పట్టణాల్లో వైరస్‌ తీవ్రత

జిల్లాలో కరోనా కేసులు పట్టణాల్లోనే అధికంగా వస్తున్నాయి. జిల్లా కేంద్రం గుంటూరులో వారం రోజుల నుంచి పరిశీలిస్తే సగటున రోజుకు 400 చొప్పున వస్తుండగా నరసరావుపేట, మంగళగిరిలో వందేసి కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో సగం కేసులు ఈమూడు పట్టణాల్లోనే ఉంటున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు గుర్తించాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 846 కేసులురాగా ఒక్క గుంటూరులోనే 420 కేసులొచ్చాయి. పట్టణాల్లో జనసంచారం ఎక్కువగా ఉండటం, భౌతిక దూరం

Published : 25 Jan 2022 03:51 IST

గుంటూరు, మంగళగిరి, నరసరావుపేటలోనే సగం కేసులు
జనసంచారం అధికంగా ఉండడమే కారణమన్న వైద్యులు
ఈనాడు-అమరావతి

జిల్లాలో కరోనా కేసులు పట్టణాల్లోనే అధికంగా వస్తున్నాయి. జిల్లా కేంద్రం గుంటూరులో వారం రోజుల నుంచి పరిశీలిస్తే సగటున రోజుకు 400 చొప్పున వస్తుండగా నరసరావుపేట, మంగళగిరిలో వందేసి కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో సగం కేసులు ఈమూడు పట్టణాల్లోనే ఉంటున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు గుర్తించాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 846 కేసులురాగా ఒక్క గుంటూరులోనే 420 కేసులొచ్చాయి. పట్టణాల్లో జనసంచారం ఎక్కువగా ఉండటం, భౌతిక దూరం పాటించకపోవటం, అత్యధిక పాఠశాలలు, కళాశాలలు ఇక్కడే ఉండటంతో రాకపోకలు సాగిస్తారు. హోటళ్లు, టీ కేఫ్‌లు వద్ద జనం కరోనా మరిచి బాగా గుమికూడుతున్నారు. వాణిజ్య, వర్తక కేంద్రాల్లో సైతం మాస్కు ధారణ వంటివి తక్కువగా ఉంటున్నాయి. మరోవైపు  ప్రభుత్వ కార్యాలయాలు పట్టణాల్లోనే ఎక్కువగా ఉండటంతో  జనసంచారం అధికంగా ఉంటోంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు చేస్తున్నా పెద్దగా అమలు కావడం లేదు. అనుమానిత లక్షణాలు కలిగిన వారు వెంటనే హోం ఐసోలేషన్‌కు వెళితే వ్యాప్తికి ఆస్కారం ఉండదని జీజీహెచ్‌ వైద్యుడు డాక్టర్‌ ఆర్‌.నాగేశ్వరరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని