logo

నేడు ఈబీసీ నేస్తం నిధుల జమ

ఈబీసీ నేస్తం పథకం కింద జిల్లాలో ఈబీసీ/ఓసీ కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన 30,913 మంది మహిళలు అర్హత పొందినట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 25 Jan 2022 03:51 IST

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఈబీసీ నేస్తం పథకం కింద జిల్లాలో ఈబీసీ/ఓసీ కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన 30,913 మంది మహిళలు అర్హత పొందినట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కొక్క మహిళకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.46.37 కోట్ల మేర వారి ఖాతాల్లో ఈనెల 25వ తేదీ మంగళవారం జమ కానున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా అర్హత గల మహిళలను గుర్తించినట్టు వివరించారు. ఇది ఈబీసీ/ఓసీ కులాలకు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రైస్తవ, కాపు వర్గాలకు వర్తించదన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని