logo

‘మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నిర్బంధం తగదు’

పోలీసులు చట్ట విరుద్ధంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను నిర్బంధించడం తగదని తెదేపా నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ వెంకన్నకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసి వన్‌టౌన్‌

Published : 25 Jan 2022 03:51 IST

విద్యాధరపురం, న్యూస్‌టుడే : పోలీసులు చట్ట విరుద్ధంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను నిర్బంధించడం తగదని తెదేపా నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ వెంకన్నకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీసుస్టేషనుకు తరలించిన విషయం తెలుసుకొని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, తెదేపా నాయకులు నాగుల్‌మీరా, పట్టాభిరామ్‌ సోమవారం రాత్రి పోలీసుస్టేషనుకు వచ్చారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్‌ మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని తెదేపా అధినేత చంద్రబాబును, సీనియర్‌ నాయకులను రాయలేని భాషలో దూషించినప్పటికీ స్పందించని పోలీసులు వెంకన్నపై కేసులు నమోదు చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు.  

స్టేషను బెయిల్‌పై వెంకన్న విడుదల:  మంత్రి కొడాలి నానిని దూషించడం, చంపుతానని బెదిరించారన్న ఆరోపణలపై అరెస్టు అయిన బుద్ధా వెంకన్నను ఐదుగంటల పాటు విచారించిన అనంతరం సోమవారం రాత్రి 11.15 గంటలకు వన్‌టౌన్‌ పోలీసులు నోటీసు ఇచ్చి స్టేషను బెయిలుపై విడుదల చేశారు. అనంతరం వెంకన్న మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని దుర్భాషలు, కౌంటరుగా తాను చేసిన విమర్శలపై చేసిన విచారణ పూర్తి వివరాలు మీడియా ద్వారా తెలియజేస్తామన్నారు. న్యాయవాదితో మాట్లాడిన తరువాత పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని