AP PRC: ఏపీలో ఉద్ధృతంగా ఉద్యోగ సంఘాల ఉద్యమం.. అన్ని జిల్లాల్లో నిరసనలు

ఏపీలో పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సోమవారం సమ్మె నోటీసు ఇచ్చి సంఘాలు..

Updated : 25 Jan 2022 12:20 IST

అమరావతి: ఏపీలో పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సోమవారం సమ్మె నోటీసు ఇచ్చి సంఘాలు.. నేటి నుంచి పూర్తిస్థాయి ఆందోళనలకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు దిగారు. పలుచోట్ల ఉద్యోగ సంఘాలు ద్విచక్ర వాహన ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ప్రభుత్వం మోసం చేసిందని.. తమకు నష్టం కలిగించే పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

విజయవాడలో పాతబస్టాండ్‌ నుంచి గాంధీనగర్‌ ధర్నాచౌక్‌ వరకు ఉద్యోగ సంఘాలు భారీ ప్రదర్శన చేపట్టాయి. అనంతపురంలో ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన తెలిపారు. మరోవైపు కలెక్టరేట్ల వద్ద ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని