CM Jagan: ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం.. ఇవ్వనివీ అమలు చేస్తున్నాం: జగన్‌

అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి లక్ష్యంగా ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్‌ అన్నారు.

Updated : 25 Jan 2022 17:21 IST

‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకం ప్రారంభించిన సీఎం

అమరావతి: అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి లక్ష్యంగా ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్‌ అన్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తున్నామని.. ఇవ్వని హామీలూ అమలు చేసి చూపిస్తున్నామని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకాన్ని జగన్‌  వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3.93 లక్షల మంది 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరి ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్‌ నొక్కి సీఎం జమ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని