AP News: జీవోలను వెనక్కి తీసుకోవాలనడం సరికాదు: సజ్జల

ఒకసారి జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేయడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

Updated : 25 Jan 2022 17:04 IST

అమరావతి: ఒకసారి జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేయడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏదీ అడగకుండానే సీఎం జగన్‌ ఇచ్చారని చెప్పారు. అమరావతిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో కలిసి సజ్జల మీడియాతో మాట్లాడారు.

నిన్నటిలాగే మంత్రుల కమిటీ నేడు కూడా ఎదురుచూసిందని ఆయన చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలు ఆలస్యంగా వచ్చినా వేచి చూశామన్నారు. స్టీరింగ్‌ కమిటీ  నేతలు వచ్చి కలిశారని.. పీఆర్సీ జీవోలు నిలుపుదల చేయాలని కోరారన్నారు. ఇంతకాలం చేసిన ప్రక్రియను తిరగతోడటం సరికాదని.. ఏమైనా మార్పులు ఉంటే వాటి గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఈనెల 27న మళ్లీ చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను కోరినట్లు సజ్జల తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని