logo
Published : 26 Jan 2022 02:52 IST

పెద్దాసుపత్రికి మరిన్ని హంగులు

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే

ఆసుపత్రిలో జనరేటర్‌ సదుపాయం లేక చరవాణి వెలుతురులో వివరాలు నమోదు చేస్తున్న ల్యాబ్‌ సిబ్బంది (దాచినచిత్రం)

రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లోని 15 ఆసుపత్రులను ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రకటించిన 15 దవాఖానాల్లో మంచిర్యాల జిల్లా పెద్దాసుపత్రి కూడా ఉంది. సంబంధిత పనులు టీఎస్‌ ఎంఐడీసీ (తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక  వసతుల అభివృద్ధి సంస్థ)చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో రూ.10.84 కోట్లు కేటాయించగా.. మంచిర్యాలజిల్లా ఆసుపత్రికి ఎంత మంజూరు చేశారు, ఏఏ పనులు చేపట్టనున్నారనేది తెలియాల్సి ఉంది.

వెంటాడుతున్న అనేక సమస్యలు..
జిల్లా ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మరుగుదొడ్లపై దృష్టిపెట్టాలి. ప్రతివార్డులో వీటి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. కాలువలు కూడా అధ్వానంగా తయారయ్యాయి.
ప్రధాన ద్వారాలు శిథిలావస్థకు చేరాయి. నూతన ద్వారాలను ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకురావాలి.
విద్యుత్తు అంతరాయం.. ఆసుపత్రిలోని ల్యాబ్‌లకు ఇబ్బంది కలిగిస్తుంది. సరఫరా నిలిపివేసిన సమయంలో సేవలు నిలిచిపోతున్నాయి. జనరేటర్‌ సదుపాయం కల్పించేలా మరమ్మతులు చేపట్టాలి.
ప్రస్తుతం కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న భవనాన్ని ఆధునికీకరించి సీబీనాట్‌ కేంద్రాన్ని తరలిస్తే ప్రయోజనం చేకూరుతుంది. ప్రధాన ద్వారం వద్దే ఈ కేంద్రం ఉండటం, నమూనాలు బహిరంగంగానే తీస్తుండటం సమస్యగా మారింది. వ్యాప్తికి కారణమవుతోంది.
పార్కింగ్‌ సైతం ఆసుపత్రికి తలనొప్పిగా మారింది. దీని కోసం శవపరీక్ష గదికి వెళ్లే దారిలోని ఖాళీ ప్రదేశంలో షెడ్డును ఏర్పాటు చేస్తే ఉపయోగపడుతుంది.


పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
- డా.అరవింద్‌, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షణాధికారి

జిల్లా ఆసుపత్రి ఆధునికీకరణకు నిధులు మంజూరు అయినట్లు సమాచారం అందింది. వేటికి వచ్చాయి, ఏఏ పనులు చేపట్టాలి అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీఎస్‌ఎంఐడీసీకి సంబంధించిన అధికారి గురువారం పర్యటించనున్నారు. ఇక్కడి సమస్యలు, అత్యవసరంగా చేయాల్సిన పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లి చేపట్టేందుకు చొరవ చూపుతాం.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts