logo

మట్టి అక్రమ తవ్వకాలపై భారీ జరిమానా

అనుమతి ఇచ్చిన దానికన్నా ఎక్కువగా మట్టి తోలకాలు జరిపిన విషయంలో మైనింగ్‌ అధికారులు భారీ జరిమానా విధించారు. వివరాలిలా ఉన్నాయి..

Published : 26 Jan 2022 03:54 IST


అక్రమ మట్టి తోలకాలు జరుగుతున్న పాండురంగాపురంలోని గుట్ట ప్రాంతం..

పాల్వంచ(జగన్నాథపురం), న్యూస్‌టుడే: అనుమతి ఇచ్చిన దానికన్నా ఎక్కువగా మట్టి తోలకాలు జరిపిన విషయంలో మైనింగ్‌ అధికారులు భారీ జరిమానా విధించారు. వివరాలిలా ఉన్నాయి.. పాల్వంచ మండలం పాండురంగాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే సంఖ్య 126/83 పట్టా భూమిలో రైతు మట్టి తోలకాలకు అనుమతి ఇవ్వాల్సిందిగా మైనింగ్‌ అధికారులకు ధరఖాస్తు చేశాడు. రెవెన్యూ అధికారులు ఎన్‌వోసీీ ఇచ్చిన అనంతరం మైనింగ్‌ అధికారులు సర్వే చేసి సుమారు 60 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి తోలకాలకు సదరు రైతుకు అనుమతిచ్చారు. సుమారు ఏడాదిగా అనుమతి పొందిన ప్రాంతం నుంచి అధికంగా మట్టి తోలకాలను చేపట్టాడు. దీనిపై పాండురంగాపురం గ్రామస్థులు కొందరు రెవెన్యూ, మైనింగ్‌ అధికారులతోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనెల 19న ఆర్డీవో ఆధ్వర్యంలో మైనింగ్‌, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పట్టా భూమి ప్రాంతాన్ని పరిశీలించి సర్వే చేశారు. అనుమతులకు మించి 28వేల క్యూబిక్‌ మీటర్లు ఎక్కువగా తవ్వకాలు చేసినట్లుగా గుర్తించారు. రూ.50.40లక్షల జరిమానా విధించినట్లు జిల్లా మైనింగ్‌ ఏడీ జైసింగ్‌ చెప్పారు. త్వరలోనే సదరు వ్యక్తికి నోటీసులు రూపంలో తెలియపరుస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని