logo

అభివృద్ధి ముద్ర!

విజయవాడ నగరాభివృద్ధిలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. దీంతో చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఆయన

Published : 26 Jan 2022 04:21 IST

వివాదరహితుడిగా రెండున్నరేళ్లు పూర్తి

వియవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

ప్రసన్న వెంకటేష్‌

విజయవాడ నగరాభివృద్ధిలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. దీంతో చాలాకాలంగా ఎదురు చూస్తున్న ఆయన పదోన్నతి కల ఇప్పటికి నెరవేరినట్లు అయ్యింది. ఒకటి, రెండు రోజుల్లో విధుల నుంచి ఆయన రిలీవ్‌ కానున్నారు. వివాద రహితుడిగా పేరుతెచ్చుకున్న ఆయన.. 2019 జూన్‌ 24న నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక అధికారిపాలన ముగింపు తదుపరి జరిగిన ఎన్నికల్లోనూ, అనంతరం ఏర్పడిన నూతన పాలకపక్షంలో భాగస్వాములయ్యారు.

నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన కాలంలో దాదాపు రూ.250 కోట్లతో పలు అభివృద్ధి కార్యాక్రమాలు చేపట్టారు. అధికాక, విపక్ష సభ్యులకు చెందిన డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. నగరంలో పలు నూతన ఆవిష్కరణకు పెద్దపీట వేశారు. ఆక్రమణకు గురైన పాయికాపురం చెరువును సంరక్షించడంతో పాటు, అక్కడ వివిధ అభివృద్ధి పనులు చేపట్టి సందర్శకులకు చేరుచేసే యత్నం చేశారు. సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ పాంటు ప్రాంతంలో బయో మైనింగ్‌ పూర్తి అనంతరం అందుబాటులోకి వచ్చిన 10 ఎకరాల్లో రూ.10 కోట్ల వ్యయంతో విశాలమైన నూతన పార్కు ఏర్పాటునకు కృషి చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధికి దూరంగా ఉన్న సామాజిక పార్కులను గుర్తించి వాటిని స్థానికులకు అందుబాటులోకి తెచ్చే యత్నం చేశారు. రాఘవయ్య, రాజీవ్‌గాంధీ పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చారు. పలు క్రీడా ప్రాంగణాలను, స్విమ్మింగ్‌ ఫూల్స్‌ను అందుబాటులో తెచ్చే యత్నం చేశారు. ఫుడ్‌ కోర్టును రూ.1.40 కోట్లతో ఆధునికీకరించి ఫుడ్‌స్ట్రీట్‌గా మార్చారు. సత్యనారాయణపురంలోని ఎన్‌ఎస్‌పీ రహదారిని రూ.4 లక్షలతో స్ట్రీట్‌ఫర్‌ ప్యూపుల్‌ ఛాలెంజ్‌ కింద ఆధునికీకరించి జాతీయ అవార్డు దక్కేలా కృషి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని