logo

ఈబీసీ నేస్తంలో రూ.96.59 కోట్లు జమ

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం కింద జిల్లాలోని 64,391 మంది అగ్రవర్ణ పేద మహిళలకు రూ.96.59 కోట్లు జమ చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్సీ

Published : 26 Jan 2022 04:21 IST

లబ్ధిదారుకు నమూనా చెక్కు అందజేస్తున్న ఉప సభాపతి రఘుపతి, ఎంపీ అయోధ్యరామిరెడ్డి,

ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి, హనుమంతరావు, ఎమ్మెల్యేలు ముస్తఫా, రోశయ్య, కలెక్టర్‌ తదితరులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం కింద జిల్లాలోని 64,391 మంది అగ్రవర్ణ పేద మహిళలకు రూ.96.59 కోట్లు జమ చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గిరిధర్‌రావు అన్నారు. ఈబీసీ నేస్తం పథకాన్ని తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టరేట్‌ నుంచి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు వీక్షించారు. లబ్ధిదారురాలు తూమాటి నాగజ్యోతి ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. సమావేశంలో ఉప సభాపతి కోన రఘుపతి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, ముస్తఫా, మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌ లక్ష్మణరెడ్డి, జేసీ జి.రాజకుమారి, దివ్యాంగుల సంక్షేమ సంస్థ ఛైర్మన్‌ ముంతాజ్‌పఠాన్‌, శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పురుషోత్తమ్‌, ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గాబాయి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని