AP News: ‘మాచ్‌ఖండ్‌’లో సాంకేతికలోపం.. పొంగిపొర్లుతున్న వరద

ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం పవర్‌గేట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. డుడుమ జలాశయంలోని

Updated : 26 Jan 2022 16:52 IST

ముంచంగిపుట్టు గ్రామీణం: ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం పవర్‌గేట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. డుడుమ జలాశయంలోని డైవర్షన్‌ డ్యాం వద్ద రెండో నంబర్‌ పవర్‌ గేట్‌లో సమస్య ఏర్పడటంతో భారీ స్థాయిలో వరదనీరు కెనాల్‌ మీది నుంచి పొంగిపొర్లుతోంది. దీంతో విద్యుత్‌ కేంద్రానికి నీరు చేరవేసే కెనాల్‌కు ప్రమాదం పొంచి ఉంది. వెంటనే అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం సాంకేతికలోపం తలెత్తిన పవర్‌గేట్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని