logo

మద్యం విక్రయిస్తున్నాడన్న అనుమానంతో పోలీసుల తనిఖీలు.. దివ్యాంగుడి మృతి

మద్యం విక్రయిస్తున్నాడన్న అనుమానంతో పోలీసులు ఓ దివ్యాంగుడిని కొట్టిన సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

Published : 26 Jan 2022 17:28 IST

టంగుటూరు: మద్యం విక్రయిస్తున్నాడన్న అనుమానంతో పోలీసులు ఓ దివ్యాంగుడిని కొట్టిన సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఎమ్‌.నిడమానూరు గ్రామానికి చెందిన దేవరపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి (36) స్థానికంగా బడ్డీకొట్టు నిర్వహిస్తూ జీవనం సాగిస్తు్న్నారు. బుధవారం టంగుటూరుకు చెందిన నలుగురు పోలీసులు గ్రామానికి వచ్చి మద్యం విక్రయిస్తున్నాడన్న అనుమానంతో లక్ష్మీనారాయణ బడ్డీకొట్టులో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అతడిపై చేయి చేసుకున్నారు. అయితే, బడ్డీకొట్టు వద్ద చేసిన తనిఖీల్లో ఎలాంటి మద్యం పట్టుబడలేదు. దీంతో వారు లక్ష్మీనారాయణను వెంటబెట్టుకొని అతడి ఇంటి వద్ద తనిఖీలకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లగానే లక్ష్మీనారాయణ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వేధింపుల వల్లే లక్ష్మీనారాయణ మృతిచెందినట్లు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని