logo

సామాజిక బాధ్యతతో సాగుదాం: జేసీ

గొప్పగా చదువుకొని ఎంత ఎత్తుకు ఎదిగినా సామాజిక బాధ్యతలను విస్మరించకూడదని జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ విద్యార్థులకు సూచించారు. మండలంలోని ఐనవోలులోని వీఐటీ (ఏపీ) విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన

Published : 27 Jan 2022 01:16 IST

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జేసీ దినేష్‌కుమార్‌, విశ్వవిద్యాలయం సిబ్బంది, అవార్డు గ్రహీతలు

తుళ్ళూరు, న్యూస్‌టుడే: గొప్పగా చదువుకొని ఎంత ఎత్తుకు ఎదిగినా సామాజిక బాధ్యతలను విస్మరించకూడదని జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ విద్యార్థులకు సూచించారు. మండలంలోని ఐనవోలులోని వీఐటీ (ఏపీ) విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన 73వ గణతంత్ర దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. వీఐటీ సామాజిక బాధ్యతగా ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలు కోల్పోయిన అన్‌సంగ్‌ హీరోస్‌ సేవలను గుర్తించి, వారి కుటుంబాలను సత్కరించడం అభినందనీయమన్నారు. వీఐటీ వీసీ డా.ఎస్వీ కోటారెడ్డి విశ్వవిద్యాలయం చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం జేసీ ప్రయాణికుల ప్రాణాలు రక్షించిన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ కండక్టరు జి.రవిశేఖర్‌, చిత్తూరులోని తిరుమల, మంగళం ఆర్టీసీ డీపోల్లో పనిచేస్తున్న చోదకులు మధు, శ్రీనివాసుల కుటుంబాలకు రూ.25 వేల వంతున అందించారు. అలాగే విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలు రక్షించిన పోలీసు శాఖలోని 12 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలను సత్కరించి రూ.25 వేలు చొప్పున పంపిణీ చేశారు. అగ్నిమాపక శాఖలో పనిచేస్తూ ప్రభుత్వ, ప్రజల ఆస్తి నష్టం జరగకుండా చూసిన పదిమంది ఫైర్‌మెన్‌లను సత్కరించి ఒక్కో కుటుంబానికి రూ.20 వేల వంతున ఇచ్చారు. కార్యక్రమంలో వీఐటీ (ఏపీ) విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ సీఎల్‌వీ శివకుమార్‌, స్టూడెంట్‌ వెల్ఫేర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనుపమ నంబూరు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని