logo

ఉద్యోగుల హక్కులను హరిస్తున్న ప్రభుత్వం

పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ విజయవాడ బందరు రోడ్డులో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం డీటీసీ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించారు. ఏపీఎన్జీవో

Published : 27 Jan 2022 01:16 IST

ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి

విజయవాడ ఆర్టీవో కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ విజయవాడ బందరు రోడ్డులో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం డీటీసీ కార్యాలయం ఆవరణలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పించారు. ఏపీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను హరించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని తమ సమస్యలను ప్రత్యక్షంగా చూసి వాటిని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ప్రయోజనం దృష్ట్యా పీఆర్సీపై ప్రభుత్వం పునారాలోచించాలని ఉద్యోగ సంఘం నేత కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఆత్మాభిమానం కోసమే ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. ఈ నెలకు పీఆర్‌సీ ఇవ్వకపోయినా పర్వాలేదని పాత జీతాలనే కొనసాగించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు ఎ.విద్యాసాగర్‌, సుధీర్‌బాబు, నక్కా వెంకటేశ్వర్లు, ఆస్కారరావు తదితరులు పాల్గొన్నారు.
గండిగుంట(ఉయ్యూరు గ్రామీణం), న్యూస్‌టుడే: పీఆర్‌సీ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఉయ్యూరు తాలుకా ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉయ్యూరు కూడలి నుంచి గండిగుంట ఎస్సీ కాలనీలోని రామాలయం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. జేఏసీ ఛైర్మన్‌ పామర్తి సుబ్బారావు, కన్వీనర్‌ పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.  

నందిగామలో అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న పీఆర్సీ సాధన సమితి నాయకులు

మహేశ్వర వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, శ్రీధర్‌, ముప్పాళ్ల శ్రీనివాసరావు తదితరులు

ఉయ్యూరు: గండిగుంటలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన  తెలియజేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు