logo

‘నానో టెక్నాలజీ’లో నేరుగా ప్రవేశాలు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 5 సంవత్సరాల ఎమ్మెస్సీ నానో టెక్నాలజీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని విభాగాధిపతి డాక్టర్‌ హరిబాబు

Published : 27 Jan 2022 05:15 IST

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 5 సంవత్సరాల ఎమ్మెస్సీ నానో టెక్నాలజీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని విభాగాధిపతి డాక్టర్‌ హరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నేరుగా వచ్చి ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు.  ఎంపీసీ, బైపీసీ పూర్తిచేసిన అభ్యర్థులు అసలు ధ్రువపత్రాలు తీసుకురావాలని, కోర్సు ఫీజు రూ.32,600 అని చెప్పారు. పది సీట్లు మాత్రమే ఉన్నాయని, ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని