logo

ఆ రైతే ఆవిష్కర్త!

పంటలు సాగు చేయటమే కాదు ఎదురయ్యే సమస్యలు అధిగమించినప్పుడే రైతులకు మంచి రాబడి ఉంటుంది. టమాటో గ్రేడింగ్‌ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను తప్పించేందుకు తానే శాస్త్రవేత్తగా మారి ఓ యంత్రాన్ని తయారు చేశాడొక రైతు.

Published : 27 Jan 2022 05:34 IST

ఈటీవీ- న్యూస్‌టుడే, వేజెండ్ల(చేబ్రోలు)

టమాటాలను గ్రేడింగ్‌ చేస్తున్న  దృశ్యం

పంటలు సాగు చేయటమే కాదు ఎదురయ్యే సమస్యలు అధిగమించినప్పుడే రైతులకు మంచి రాబడి ఉంటుంది. టమాటో గ్రేడింగ్‌ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను తప్పించేందుకు తానే శాస్త్రవేత్తగా మారి ఓ యంత్రాన్ని తయారు చేశాడొక రైతు. వేజెండ్ల గ్రామానికి చెందిన రైతు గవిని హరికృష్ణ తయారు చేసిన ఈ యంత్రం ద్వారా పెద్ద, చిన్న టమాటోల్ని సులువుగా వేరు చేయొచ్చు. గ్రేడింగ్‌ కోసం కూలీల అవసరం తప్పి ఆ మేరకు ఖర్చులు ఆదా అయ్యాయి. ఈ యంత్రానికి కరెంటు అవసరం లేదు. పైగా పొలంలో ఎక్కడికైనా తీసుకెళ్లేలా తయారు చేయటం విశేషం. 

‘నేను పదో తరగతి వరకూ చదువుకున్నాను. 20ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. టమాటో కాయలు కోసిన తర్వాత మార్కెట్‌కు తీసుకెళ్తే వాటిలో సన్నకాయలు కలిశాయని వ్యాపారులు ధర తగ్గించేవారు. రెండు, మూడు కిలోలు తగ్గించి డబ్బులిచ్చేవారు. గతేడాది బెంగళూరు వెళ్లినప్పుడు అక్కడ ఓ పెద్ద మాల్‌ నిర్వాహకులు టమాటోల్ని మెషీన్‌తో గ్రేడింగ్‌ చేయటం చూశాను. పెద్ద కాయలకు అధిక ధర వస్తున్న విషయం గమనించాను. అలాంటి మెషీన్‌ ఎంతవుతుందని ఆరా తీస్తే రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకూ అవుతుందని తెలిసింది. అంత ఖర్చు ఎందుకని నేనే తయారు చేశాను’ అంటూ హరికృష్ణ అనుభవాన్ని చెప్పుకొచ్చారు. మొదట్లో యంత్రం తయారీలో తప్పులు జరిగాయి. చివరికి విజయం సాధించాను.  యంత్రం తుప్పు పట్టకుండా ఉండేందుకు జింక్‌ ఫ్రేములు, స్టీల్‌ కడ్డీలు, రేకులు వినియోగించారు. దీనికి చక్రాలు అమర్చటం ద్వారా సులువుగా పొలంలో అటూ, ఇటూ మార్చుకోవచ్చు. మొత్తం రూ.50వేలు ఖర్చయింది. దీంతో రోజుకు 200 పెట్టల్ని గ్రేడింగ్‌ చేస్తున్నారు. అదే పని కూలీలతో చేయిస్తే రూ.2వేలు ఖర్చవుతుంది. ఇప్పుడు రూ.500 సరిపోతుంది. యంత్రంతో గ్రేడింగ్‌ చేసిన కాయలంటే వ్యాపారులు మారుమాట్లడకుండా తీసుకుంటున్నారు. ఇప్పుడు రూ.35నుంచి 40వేలల్లో తయారు యంత్రం తయారు చేయవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని