AP PRC: మళ్లీ పిలుపు..చర్చలకు రావాలని పీఆర్సీ సాధన సమితికి ప్రభుత్వం ఆహ్వానం

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న పీఆర్సీ సాధన సమితి నేతలకు ప్రభుత్వం మరోసారి

Updated : 27 Jan 2022 09:42 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న పీఆర్సీ సాధన సమితి నేతలకు ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. సచివాలయంలో మధ్యాహ్నం 12గంటలకు చర్చలకు రావాలని పిలిచింది. పీఆర్సీపై ప్రభుత్వ కమిటీతో చర్చలకు రావాలని కోరింది. స్టీరింగ్‌ కమిటీలోని 20మంది సభ్యులు చర్చలకు రావాలని పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ నేతలను ఆహ్వానించారు.

మరోవైపు పీఆర్సీ సాధన సమితి నేతలు మంత్రుల కమిటీ ముందు ఇప్పటికే తమ మూడు డిమాండ్లు ఉంచారు. వాటిపై నిర్ణయం తీసుకుంటేనే చర్చలకు వస్తామని వారు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని