AP News: గుడివాడ క్యాసినో ఘటనపై గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు

గుడివాడలో క్యాసినో జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆ పార్టీ నిజనిర్థారణ కమిటీ అక్కడ పర్యటించింది.

Updated : 27 Jan 2022 13:42 IST

విజయవాడ: గుడివాడలో క్యాసినో జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆ పార్టీ నిజనిర్థారణ కమిటీ అక్కడ పర్యటించింది. అనంతరం నివేదిక రూపొందించి తెదేపా అధినేత చంద్రబాబుకు అందజేసింది. దీనికి సంబంధించి కమిటీలోని సభ్యులు ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారనడానికి సంబంధించి కరప్రతాలు, వీడియో సాక్ష్యాలతో పాటు నివేదికను ఆయనకు అందజేశారు. క్యాసినోలో నృత్యం చేసిన 13 మంది యువతులు ఈ నెల 17న విజయవాడ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకి, అక్కడి నుంచి గోవాకి వెళ్లినట్టు ప్యాసింజర్‌ లిస్టు.. వారికి టికెట్లు బుక్‌ చేసిన వ్యక్తి ఫోన్‌ నంబర్లు సేకరించి సమగ్ర నివేదిక గవర్నర్‌కు అందజేశారు.

గుడివాడ పర్యటన సందర్భంగా తమపై జరిగిన దాడి, పోలీసుల వ్యవహారంపైనా ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి కొడాలి నానీని మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహణపై విచారణ కోరుతూ చంద్రబాబు రాసిన లేఖను గవర్నర్‌కు ఇచ్చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమా తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని