logo

రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లింకింగ్‌ దీపాలు

విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రమాదకరమైన హైవే క్రాసింగ్‌ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు మల్టిపుల్‌ బ్లింకింగ్‌ లైట్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా తెలిపారు. మూలపాడు వద్ద జాతీయ

Published : 28 Jan 2022 02:08 IST

నగర సీపీ కాంతి రాణాటాటా

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే : విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ప్రమాదకరమైన హైవే క్రాసింగ్‌ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు మల్టిపుల్‌ బ్లింకింగ్‌ లైట్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా తెలిపారు. మూలపాడు వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన లైట్స్‌ను ఆయన గురువారం పరిశీలించారు. మూలపాడు జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద జాతీయ రహదారి దాటేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను స్థానికులు ఆయనకు వివరించారు. అనంతరం దొనబండ వద్ద కమిషనరేట్‌ పరిధి సరిహద్దులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ విలేకరులతో మాట్లాడుతూ దొనబండ నుంచి మొదలయ్యే సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఐదు ప్రమాదకర హైవే క్రాసింగ్‌లను గుర్తించినట్లు చెప్పారు. వాటి వద్ద రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నూతనంగా మల్టీపుల్‌ బ్లింకింగ్‌ లైట్స్‌ను పైలట్‌ ప్రాజెక్టు కింద మూలపాడు వద్ద ఏర్పాటు చేశామన్నారు. వాటి పనితీరును పరిశీలించిన తరువాత మిగతా ప్రదేశాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. హైవేపై స్కూల్‌ జోన్లలో రోడ్డు దాటే విద్యార్థులకు సహకరించేందుకు ఉదయం సాయంత్రం వేళల్లో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ రహదారి పక్కన ఇష్టారాజ్యంగా లారీలను పార్కింగ్‌ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీసీపీ బాబురావు, ఏసీపీలు హనుమంతరావు, రామచంద్రరావు, ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్‌ కుపార్‌, ఎస్సైలు పోలీసు సిబ్బంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని