logo

కేఎస్‌ వ్యాస్‌కు ఘన నివాళి

కేఎస్‌ వ్యాస్‌ 29వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ రోడ్డులోని కేఎస్‌ వ్యాస్‌ కాంప్లెక్సు వద్ద వ్యాస్‌ విగ్రహానికి పోలీస్‌ కమిషనర్‌ బి.కాంతిరాణా టాటా ఘనంగా నివాళులర్పించారు. పోలీసుశాఖకు ఆయన అందించిన సేవలను కొనియాడారు

Published : 28 Jan 2022 02:08 IST

కేఎస్‌ వ్యాస్‌ విగ్రహం వద్ద మౌనం పాటిస్తున్న పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా, అడ్మిన్‌ డీసీపీ డి.మేరీప్రశాంతి తదితరులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : కేఎస్‌ వ్యాస్‌ 29వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ రోడ్డులోని కేఎస్‌ వ్యాస్‌ కాంప్లెక్సు వద్ద వ్యాస్‌ విగ్రహానికి పోలీస్‌ కమిషనర్‌ బి.కాంతిరాణా టాటా ఘనంగా నివాళులర్పించారు. పోలీసుశాఖకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. కొద్దిసేపు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ డీసీపీ డి.మేరీప్రశాంతి, ట్రాఫిక్‌ ఏడీసీపీ టి.సర్కార్‌, హెడ్‌ క్వార్టర్స్‌ ఏసీపీ చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని