logo

వైకాపా నేతలివి చిల్లర రాజకీయాలు

తెదేపా నాయకుల వాహనాలపై దాడులు చేయడం, ఫ్లెక్సీలు చించడం వంటి చిల్లర రాజకీయాలు చేయడం వైకాపా నేతలు మానుకోవాలని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి హితవు పలికారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు

Published : 28 Jan 2022 02:37 IST

చంద్రయ్య సంస్మరణ సభలో జూలకంటి విమర్శ

చంద్రయ్య చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న బ్రహ్మారెడ్డి, తెదేపా నాయకులు

మాచర్ల, న్యూస్‌టుడే: తెదేపా నాయకుల వాహనాలపై దాడులు చేయడం, ఫ్లెక్సీలు చించడం వంటి చిల్లర రాజకీయాలు చేయడం వైకాపా నేతలు మానుకోవాలని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి హితవు పలికారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో ఇటీవల హత్యకు గురయిన తెదేపా నాయకుడు తోట చంద్రయ్య సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జూలకంటి మాట్లాడుతూ పార్టీ కోసం చివరి వరకు చంద్రయ్య పోరాడారన్నారు. చిన్న రేకులషెడ్డులో నివాసం ఉంటూ, తన సొంత స్థలంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. చంద్రయ్యను పాతకక్షలతో చంపారని పోలీసులు చెప్పడాన్ని తప్పుపట్టారు. ఏ కేసులో నిందితునిగా ఉన్నారో చెప్పాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన మాటలను పోలీసులు పలకడం సిగ్గుచేటన్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి నియంతృత్వం వైపు వెళ్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ వెన్నా సాంబశివారెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కరిముల్లా, ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ధారునాయక్‌, వెల్దుర్తి మండలం తెదేపా నాయకులు కుర్రి శివారెడ్డి, మల్లికార్జునరావుతో పాటు తెదేపా నాయకులు చంద్రయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు.

గుండ్లపాడులో ఉద్రిక్తత: చంద్రయ్య దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ఫ్లెక్సీ ఒకదానిని గుర్తుతెలియని వ్యక్తులు కొంతమేర కోశారు. దీనిపై కుటుంబ సభ్యులతోపాటు, బంధువులు, తెదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఫ్లెక్ల్సీనీ చించడాన్ని కుమారుడు వీరాంజనేయులు తప్పుపట్టారు. విషయం తెలిసిన వెల్దుర్తి ఎస్‌ఐ తిరపతిరావు ముందు జాగ్రత్తగా సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. చంద్రయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి శాంతింపజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని