logo

వైద్యశాఖలో ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

వైద్య శాఖలో ఉద్యోగుల బదిలీలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతించింది. గతంలో బదిలీలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ శుక్రవారం...

Published : 28 Jan 2022 23:39 IST

అమరావతి: వైద్యశాఖలో ఉద్యోగుల బదిలీలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతించింది. గతంలో బదిలీలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7లోగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫిబ్రవరి 15లోగా తుది జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. మార్చి 1 నుంచి వైద్యశాఖలో బదిలీలపై నిషేధం వర్తిస్తుందని వెల్లడించింది. ఫిబ్రవరి 28 నాటికి ఒకే చోట ఐదేళ్లు పూర్తి అయితే బదిలీ తప్పనిసరని పేర్కొంది. మూడు ఏళ్లుగా ఒకే చోట పని చేస్తోన్న ఉద్యోగులకు బదిలీ కోసం అభ్యర్థించే అవకాశం కల్పించారు. బదిలీ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. బదిలీల కౌన్సిలింగ్‌ బాధ్యత ఉన్నతాధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని