Andhra News: హిజాబ్‌ వివాదంపై స్పందించిన లయోలా కళాశాల ప్రిన్సిపల్‌

హిజాబ్‌ వివాదంపై విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల యాజమాన్యం స్పందించింది. కళాశాల ప్రిన్సిపల్‌ కిషోర్‌ మీడియాతో

Updated : 17 Feb 2022 15:08 IST

కరెన్సీ నగర్‌(విజయవాడ): హిజాబ్‌ వివాదంపై విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల యాజమాన్యం స్పందించింది. కళాశాల ప్రిన్సిపల్‌ కిషోర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇద్దరు విద్యార్థినులు ఇవాళ హిజాబ్‌ ధరించి కళాశాలకు వచ్చారు. తరగతి గదుల రౌండ్స్‌కు వెళ్తున్నప్పుడు వారిని గమనించాను. కళాశాలకు హిజాబ్‌ ధరించి వస్తున్నారేంటని ప్రశ్నించా. అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులు నా వద్దకు వచ్చారు. కళాశాలలో చేరేటప్పుడే నిబంధనలపై సంతకం చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతో తరగతి గదిలోకి అనుమతించాం. రేపటి నుంచి హిజాబ్‌ ధరించి రావాలా? వద్దా?అనేది నిర్ణయిస్తాం’’ అని ప్రిన్సిపల్‌ కిశోర్‌ అన్నారు.

ఈ ఉదయం ఇద్దరు బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కళాశాలకు వచ్చారు. వారిని చూసిన ప్రిన్సిపల్‌ హిజాబ్‌తో ఎందుకొచ్చారని.. దుస్తులు మార్చుకొని రావాలన్నారు. దీంతో విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ముస్లిం మత పెద్దలతో పాటు తల్లిదండ్రులు, పోలీసులు ప్రిన్సిపల్‌తో మాట్లాడారు. అనంతరం విద్యార్థినులను తరగతి గదుల్లోకి అనుమతించిన విషయం తెలిసిందే.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని