Andhra News: ఈసారి తెదేపాకు 160 స్థానాలు ఖాయం: అచ్చెన్నాయుడు

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని అనుకోవద్దని.. ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశముందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Updated : 02 Mar 2022 14:56 IST

విజయవాడ: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని అనుకోవద్దని.. ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశముందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈసారి కచ్చితంగా 160 స్థానాల్లో తెదేపా విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులను జగన్‌ ప్రభుత్వం అడుగడుగునా ముంచిందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి రైతునూ కలవాలని రైతువిభాగం నేతలకు ఆయన నిర్దేశించారు. మాజీ మంత్రి వివేకా హత్య ద్వారా వచ్చిన సానుభూతితోనే జగన్‌ సీఎం అయ్యారని అచ్చెన్న వ్యాఖ్యానించారు. హత్య కేసు నిందితులను ఎందుకు శిక్షించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో ఇప్పుడున్నంత వ్యతిరేకత ఎప్పుడూ లేదన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని