Nara Lokesh: అవి సహజ మరణాలైతే ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు?: లోకేశ్‌

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని వరుస మరణాలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ అన్నారు. వైకాపా నేతల

Published : 16 Mar 2022 14:53 IST

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని వరుస మరణాలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ అన్నారు. వైకాపా నేతల ప్రోత్సాహంతోనే నాటు సారా తయారవుతోందని ఆయన ఆరోపించారు. శాసనమండలి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. నాటు సారా మరణాలపై ప్రభుత్వం చర్చకు ఎందుకు రావడం లేదని లోకేశ్ నిలదీశారు. జంగారెడ్డిగూడెం మరణాలను సహజ మరణాలుగా సీఎం జగన్‌ పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. సహజ మరణాలైతే ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. మంత్రి చెప్పేదొకటి.. సీఎం చెప్పేది మరొకటని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ రాజీనామా చేయాలని.. దీనిపై జంగారెడ్డిగూడెం ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని