AP EAPCET: ఏపీఈఏపీ సెట్‌ షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్‌-2022 షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Published : 23 Mar 2022 15:15 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్‌-2022 షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జులై 4 నుంచి 8 వరకు ఇంజినీరింగ్‌.. జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు రాసేవారికి ఇబ్బంది లేకుండా షెడ్యూల్‌ విడుదల చేసినట్లు చెప్పారు. దానికి అనుగుణంగానే పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశామన్నారు. ఆగస్ట్‌ 15 తర్వాత ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదల చేసి సెప్టెంబర్‌ 2వ వారంలో తరగతులు కూడా ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. పరీక్షా విధానం, ర్యాంకుల ప్రకటనలో మార్పుల్లేవని మంత్రి స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని