Andhra News: వక్రభాష్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: కనకమేడల

పార్లమెంట్‌కు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు.

Updated : 27 Mar 2022 15:00 IST

దిల్లీ: పార్లమెంట్‌కు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. చట్టాల ప్రకారమే పునర్విభజన చట్టం ఇప్పటికే అమలు చేశారని చెప్పారు. దీని ప్రకారమే ఏపీ రాజధానిగా అమరావతి ఏర్పాటు చేశారని అన్నారు. దిల్లీలో ఎంపీ రామ్మోహన్‌నాయుడితో కలసి కనకమేడల మీడియాతో మాట్లాడారు.

‘‘రాజ్యాంగాన్ని విశ్లేషించేందుకు కేంద్రం సుప్రీం కాదు. కేంద్ర ప్రభుత్వమే చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించింది. ప్రభుత్వాలు అంటే వ్యక్తులు కాదు సంస్థలు అని గుర్తించాలి. ప్రభుత్వాలు కొనసాగుతాయి.. వ్యక్తులు మారతారు. పార్టీలు మారితే రాజ్యాంగాన్ని మారుస్తామంటే కుదరదు. రాజ్యాంగాన్ని పరిరక్షించే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు. జడ్జిలను బెదిరిస్తున్నారు, న్యాయవ్యవస్థలను దూషిస్తున్నారు. దీన్ని కోర్టుల పట్ల బెదిరింపు ధోరణితో ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. చట్టాలను మార్చే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంది. కోర్టు తీర్పులపై సభలో వక్రభాష్యాలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు’’ అని కనకమేడల అన్నారు.

మద్యం మరణాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఏపీ ప్రభుత్వం రాజధాని అంశాన్ని ప్రభుత్వం వాడుకుంటోందని రామ్మోహన్‌నాయుడు అన్నారు. మూడు రాజధానులని మూడేళ్లలో ఒక్కచోటైనా అభివృద్ధి చేశారా అని ఆయన ప్రశ్నించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు