AP News: ‘బాలయ్య గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా’
ఎమ్మెల్సీ ఇక్బాల్
సమావేశంలో మాట్లాడుతున్న ఇక్బాల్
హిందూపురం పట్టణం, న్యూస్టుడే: నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ రాజీనామా చేసి ఎన్నికల్లో తనతో పోటీపడాలని, ఓడిపోతే రాజకీయాలను వదిలేసి, హిందూపురం వదిలి వెళ్లిపోతానని ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్ విసిరారు. బుధవారం పట్టణంలో తన కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వరుస ఓటములతో కుదేలవుతుండటంతో, ప్రజల్లో అభాసుపాలవుతామనే భయంతోనే మాజీ సీఎం చంద్రబాబు పరిషత్ ఎన్నికల బహిష్కరణ డ్రామా ఆడారన్నారు. కుప్పం నుంచి హిందూపురం వరకు ఎన్నికల్లో ఓడిపోయినా, ఆత్మ విమర్శ చేసుకోకుండా, ఇంకా సమర్థించుకోవడానికి తెదేపా నాయకులు ప్రయత్నించడం వారి దివాలా కోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.