logo
Published : 02 Dec 2021 06:13 IST

సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై ఘర్షణ

గాయపడిన రమేష్‌బాబు

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: ప్రశాంతంగా ఉన్న గ్రామంలో సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల కారణంగా తెదేపా, వైకాపా కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ గొడవలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరులో తెదేపా కార్యకర్త చిరంజీవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన పోస్టును తన చరవాణిలో షేర్‌ చేశాడు. అది చూసిన ఆంజనేయులు అతడి కుటుంబాన్ని విమర్శిస్తూ అసభ్య వ్యాఖ్యలు పెట్టాడు. దీంతో తన స్నేహితుడైన రమేష్‌బాబుతో కలిసి చిరంజీవి వాగ్వాదానికి దిగారు. వీరి గొడవ తారాస్థాయికి చేరుకుని రాళ్లతో దాడి చేసుకున్నారు. ముగ్గురూ గాయపడగా చికిత్స నిమిత్తం పెద్దవడుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అనంతపురం తరలించారు. వీరిని పరామర్శించేందుకు ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రాగా.. ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేసి ఘర్షణలకు తావివ్వకుండా చర్యలు చేపట్టారు.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని