logo
Published : 02/12/2021 06:13 IST

కొవిడ్‌తో అప్రమత్తంగా ఉండండి

కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న ఎస్పీ ఫక్కీరప్ప

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: కొవిడ్‌ థర్డ్‌వేవ్‌, కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప పోలీసులు, వారి కుటుంబాలకు సూచించారు. బుధవారం ఎస్పీ హోంగార్డుల నుంచి అదనపు ఎస్పీలతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసుశాఖ నుంచి తీసుకోబోయే ముందస్తు చర్యలను వివరించారు. ప్రతిఒక్కరూ మాస్కులు, శానిటైజర్‌ వినియోగించాలన్నారు. ఎవరైనా కొవిడ్‌బారిన పడితే తక్షణమే తమదృష్టికి తీసుకురావాలని కోరారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ మాస్క్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. సివిల్స్‌, గ్రూప్స్‌, బ్యాంకు, ఇతర పరీక్షలకు శిక్షణ పొందే పోలీసు పిల్లల కోసం పోటీ పరీక్షల మెటీరియల్‌ను స్థానికంగా డిజిటల్‌ లైబ్రరీలో అందుబాటులో ఉంచామన్నారు. మహిళా పోలీసు సిబ్బందికి అనంతపురం పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో మహిళా బ్యారెక్‌ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అతి తక్కువ ధరకు నిత్యావసర వస్తువుల కోసం మొబైల్‌ క్యాంటీన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. వచ్చే జూన్‌ తర్వాత ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని పారదర్శకంగా బదిలీలు చేపడతామని హమీ ఇచ్చారు.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని