logo
Published : 02/12/2021 06:13 IST

జడ్పీలో 17 మందికి పదోన్నతులు

జడ్పీ ఛైర్‌పర్సన్‌, సీఈఓకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఉద్యోగులు

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: రెండు నెలలుగా ఊరిస్తున్న పదోన్నతుల కల ఎట్టకేలకు నెరవేరింది. జడ్పీలో జూనియర్‌ సహాయకులుగా పనిచేస్తున్న 17 మందికి సీనియర్‌ సహాయకులుగా పదోన్నతులు కల్పిస్తూ గత నెలలోనే ఉత్తర్వులు రూపొందించారు. ఒక ఉద్యోగి నుంచి అభ్యంతరం రావడంతో సీనియారిటీ ఫ్యానెల్‌కు అనుగుణంగా పదోన్నతుల సంఖ్యను సవరించారు. మండల పరిషత్‌, జడ్పీ పాఠశాలలు, జిల్లా ప్రజాపరిషత్తుల్లో పనిచేసే జూనియర్‌ సహాయకులకు పదోన్నతులు కల్పించారు. వీరిని మండల పరిషత్తు, జడ్పీ, పీఆర్‌ఐ విభాగాలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, సీఈఓ భాస్కర్‌రెడ్డి, ఉప సీఈఓ శ్రీనివాసులు చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్‌, పదోన్నతి పొందిన ఉద్యోగులు ఛైర్మన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని