logo
Published : 02/12/2021 06:13 IST

లోక్‌ అదాలత్‌ విజయవంతం చేయండి

ఎస్పీ ఫక్కీరప్పతో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక

అనంతపురం(మూడోరోడ్డు), న్యూస్‌టుడే: ఈనెల 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక అన్నారు. జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో బుధవారం ఎస్పీ ఫక్కీరప్ప, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి దీనబాబుతో సమావేశం నిర్వహించారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా పోలీసులు సహకరించాలన్నారు. సివిల్‌ కేసులతో పాటు రాజీ కాదగిన క్రిమినల్‌ కేసులకు పరిష్కారం చూపాలన్నారు. చెక్‌బౌన్స్‌, బీమా పరిహారం, మోటారు ప్రమాద పరిహార కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కోరారు.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని