logo
Published : 02/12/2021 06:13 IST

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి తదితరులు

రొద్దం, న్యూస్‌టుడే: అధిక వర్షాలతో వరి, పత్తి, పప్పుశనగ, వేరుసెనగ, మొక్కజొన్న రైతులు పూర్తిగా నష్టపోయారని, ప్రభుత్వమే ఆదుకోవాలని హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ డిమాండు చేశారు. బుధవారం వారు స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట పార్టీ నాయకులతో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటల పాటు బైఠాయించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బాధితులకు న్యాయం జరిగేంతవరకూ పోరాటం చేస్తామన్నారు. సమాచారం అందుకున్న ఏడీఏ స్వయంప్రభ, మండల ఏవో నివేదిత, పోలీసులు చేరుకుని నిరసనకారులతో చర్చించారు. బాధిత రైతులను గుర్తించి నివేదిక సిద్ధం చేస్తామని, తగిన పరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో నాయకులు నిరసన విరమించారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణప్ప, జీవీపీ నాయుడు, మాధవనాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిన్నప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని