logo

మహిళను దుర్భాషలాడిన ఎక్సైజ్‌ అధికారి

హిందూపురం గ్రామీణ మండలం తూమకుంట చెక్‌పోస్ట్‌ బస్టాండ్‌ వద్ద ఓ ఎక్సైజ్‌ అధికారి శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ మహిళను దుర్భాషలాడటం వివాదాస్పదంగా మారింది. బాధితురాలు

Published : 05 Dec 2021 04:48 IST

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: హిందూపురం గ్రామీణ మండలం తూమకుంట చెక్‌పోస్ట్‌ బస్టాండ్‌ వద్ద ఓ ఎక్సైజ్‌ అధికారి శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఓ మహిళను దుర్భాషలాడటం వివాదాస్పదంగా మారింది. బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు.. పట్టణంలోని చాకలి కుంటకు చెందిన నాగమణి తూమకుంట పారిశ్రామిక వాడలో లాండ్రీ పెట్టుకున్నారు. దుస్తులను మూటకట్టుకొని పట్టణానికి రావడానికి రాత్రి 7 గంటల సమయంలో బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై సివిల్‌ డ్రస్‌లో వచ్చి, తాను ఎక్సైజ్‌ అధికారి అని, మద్యం పాకెట్లు తీసుకెళ్తున్నావా అంటూ దుస్తులమూట విప్పాలని బూతులు తిట్టారని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయమై, చెక్‌పోస్టు సీఐ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా, అనుమానాస్పదంగా ఉండటంతో దుస్తుల మూట తనిఖీ చేశానని, దుర్భాష లాడలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని