Published : 05 Dec 2021 04:48 IST
మాజీ మంత్రి రఘువీరారెడ్డి కంటతడి
భావోద్వేగానికి గురైనమాజీ మంత్రి రఘువీరారెడ్డి
మడకశిర, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి వార్త విన్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయడం గర్వంగా ఉందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినేట్‌లో రోశయ్యతో కలిసి పని చేశామని, అందరికీ చక్కటి సహకారం అందించారని రఘువీరారెడ్డి గుర్తు చేసుకున్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గొప్ప నాయకుడని, ఆయన లేని అసెంబ్లీ, కౌన్సిల్‌ను చూడటానికే ఇబ్బందిగా ఉండేదని చెప్పారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లారు.
Tags :