logo

ఏపీఎస్పీ బెటాలియన్‌ సందర్శన

ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌ను ఎస్పీ ఫక్కీరప్ప శనివారం కమాండెంట్‌ ప్రకాష్‌తో కలిసి సందర్శించారు. ఆహ్లాదకర వాతావరణంలో బెటాలియన్‌ ఏర్పాటు చేశారని ఎస్పీ తెలిపారు. ముందుగా బెటాలియన్‌ సిబ్బందితో వందనం స్వీకరించారు. అనంతరం మొక్కలు

Published : 05 Dec 2021 04:48 IST

సిబ్బంది నుంచి వందనం స్వీకరిస్తున్న ఎస్పీ ఫక్కీరప్ప

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌ను ఎస్పీ ఫక్కీరప్ప శనివారం కమాండెంట్‌ ప్రకాష్‌తో కలిసి సందర్శించారు. ఆహ్లాదకర వాతావరణంలో బెటాలియన్‌ ఏర్పాటు చేశారని ఎస్పీ తెలిపారు. ముందుగా బెటాలియన్‌ సిబ్బందితో వందనం స్వీకరించారు. అనంతరం మొక్కలు నాటారు. పోలీసు సిబ్బందికి వృత్తి నైపుణ్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని కమాండెంట్‌ను కోరారు. ఎలాంటి విపత్తులు వచ్చినా విధులు నిర్వహించడానికి సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్‌ నాగేశ్వరప్ప, సీఐ సాయిప్రసాద్‌, బెటాలియన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని