logo

సమన్వయలోపంతోనే పెనుకొండలో ఓటమి

జిల్లా నేతల మధ్య సమన్వయలోపం కారణంగానే పెనుకొండ మున్సిపల్‌ ఎన్నికల్లో తెదేపా ఓటమి చెందిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో అలసత్వం వహిస్తే ఎంతటి నేతలైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని

Published : 05 Dec 2021 04:48 IST

జిల్లా నేతలపై చంద్రబాబు అసంతృప్తి

మాట్లాడుతున్న చంద్రబాబు, పక్కన కాలవ శ్రీనివాసులు,

పల్లె రఘునాథరెడ్డి, నిమ్మల కిష్టప్ప, బీకే పార్ధసారథి తదితరులు

ఈనాడు-అమరావతి: జిల్లా నేతల మధ్య సమన్వయలోపం కారణంగానే పెనుకొండ మున్సిపల్‌ ఎన్నికల్లో తెదేపా ఓటమి చెందిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో అలసత్వం వహిస్తే ఎంతటి నేతలైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో పెనుకొండ మున్సిపల్‌ ఫలితాలపై శనివారం ఆయన సమీక్షించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న పెనుకొండలో తెదేపాకు ఆశించిన ఫలితాలు రాకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ‘నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి, కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారినే ప్రజలు ఆదరిస్తారు. వైకాపా దుర్మార్గాల్ని ఎండగడుతూ నిత్యం ప్రజల్లో ఉండాలి. బాధితుల పక్షాన నిలవాలి’ అని చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా వైకాపా నాయకుల బెదిరింపులు, వాలంటీర్ల దౌర్జన్యాలను పలువురు ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని