logo
Published : 05/12/2021 04:48 IST

అనంతతో రోశయ్యకు అనుబంధం

సత్యసాయి మహాసమాధి వద్ద రోశయ్య

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు జిల్లాలో విడదీయరాని అనుబంధం ఉంది. వివిధ హోదాల్లో ఆయన జిల్లాలో పర్యటించారు. ముఖ్యంగా పుట్టపర్తి సత్యసాయిబాబా దర్శనార్థం పలుమార్లు వచ్చారు. వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో 1991లో ప్రథమంగా దర్శించుకున్నారు. 2010లో సత్యసాయి 85వ జన్మదిన వేడుకల్లో, సత్యసాయి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కలిసి పాల్గొన్నారు. 2010 నవంబరు 22న పుట్టపర్తిలో రూ.కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. 2011 నవంబరు 23న సత్యసాయి జయంతి వేడుకల్లో తమిళనాడు గవర్నర్‌ హోదాలో పాల్గొన్నారు. సత్యసాయి ట్రస్టు వార్షిక నివేదికను ఆవిష్కరించారు. రోశయ్య మృతికి సత్యసాయి ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌.జె.రత్నాకర్‌, జిల్లాలోని పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read latest Anantapur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని