logo

చిరువ్యాపారులపై చిర్రుబుర్రు..

ఫ్రెండ్లీ పోలీస్‌ అంటూ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి పదేపదే గుర్తు చేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. చిరువ్యాపారులపై శుక్రవారం ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ విరుచుకుపడ్డారు. ఎటువంటి హెచ్చరికలు చేయకుండా చేతులకు, కాళ్లకు పనిచెప్పారు. నగరంలోని

Published : 15 Jan 2022 05:50 IST


వ్యాపారి ఏర్పాటు చేసుకున్న గొడుగును పైకి విసిరేస్తున్న కానిస్టేబుల్‌

ఫ్రెండ్లీ పోలీస్‌ అంటూ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి పదేపదే గుర్తు చేస్తున్నా కొందరి తీరు మారడం లేదు. చిరువ్యాపారులపై శుక్రవారం ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ విరుచుకుపడ్డారు. ఎటువంటి హెచ్చరికలు చేయకుండా చేతులకు, కాళ్లకు పనిచెప్పారు. నగరంలోని పాతూరులో సంక్రాంతి సందర్భంగా పండగ సమయాల్లో మామిడాకులు, పండ్లు, కాయలు అమ్ముకునే వారిపై హడావుడి చేశారు. మామిడాకుల సంచిని పడేసి, కింద ఉన్న ట్రేను కాలితో తన్నేశారు. అనంతరం తాడిపత్రి రోడ్డువైపు వెళ్లి నీడ కోసం ఏర్పాటు చేసుకున్న గొడుగును తీసి దుకాణాలపై విసిరేశారు. పోలీసులకు ఏర్పాటు చేసిన షెడ్డునీడలో కొందరు వృద్ధులు వేరుసెనగ, అరటి ఆకులు అమ్ముకుంటుండగా వారికి అడ్డుగా తన వాహనాన్ని నిలిపి ట్రాఫిక్‌ను పర్యవేక్షించారు. చిరువ్యాపారులపై ప్రతాపం చూపడమేంటని స్థానికులు ప్రశ్నించారు. - ఈనాడు: అనంతపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని