logo

ఆటో చోదకుల శ్రమదానం

మండలంలోని మేడాపురం గ్రామానికి చెందిన ఆటో చోదకులు దారిపై ఏర్పడిన గుంతలను శ్రమదానంతో పూడ్చివేసి బాగు చేశారు. గ్రామానికి చెందిన పదిమంది ఆటో చోదకులు నామాల గ్రామం నుంచి ధర్మవరం మండలం మోటుమర్ల వరకు దాదాపు ఐదు కి.మీ.

Published : 15 Jan 2022 05:50 IST


గుంతల్లోకి మట్టివేస్తున్న ఆటో చోదకులు

మేడాపురం (చెన్నేకొత్తపల్లి), న్యూస్‌టుడే: మండలంలోని మేడాపురం గ్రామానికి చెందిన ఆటో చోదకులు దారిపై ఏర్పడిన గుంతలను శ్రమదానంతో పూడ్చివేసి బాగు చేశారు. గ్రామానికి చెందిన పదిమంది ఆటో చోదకులు నామాల గ్రామం నుంచి ధర్మవరం మండలం మోటుమర్ల వరకు దాదాపు ఐదు కి.మీ. మేర దారిపై పెద్దపెద్ద గుంతలు పడటంతో వాటిని శుక్రవారం పూడ్చివేశారు. వారు మాట్లాడుతూ దారి శిథిలావస్థకు చేరుకోవడంతో ఆటోలు నడిపేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తరచూ ఆటోలు మరమ్మతులకు గురికావడంతో చోదకులంతా కలిసి దారిని బాగు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని