logo

బాబయ్యస్వామి ఉరుసు ప్రారంభం

పెనుకొండలోని బాబయ్యస్వామి ఉరుసు ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ప్రభుత్వం తరఫున పక్షాన పట్టుచాదర్‌ను సమర్పించారు. మొదటగా చాదర్‌ను చెరువురోడ్డులోని పాంచ్‌బీబీ దర్గా నుంచి గుర్రపుబండిపై ప్రదర్శనగా

Published : 15 Jan 2022 05:50 IST


ఆకట్టుకున్న ఫకీర్ల విన్యాసాలు

పెనుకొండ, న్యూస్‌టుడే: పెనుకొండలోని బాబయ్యస్వామి ఉరుసు ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ప్రభుత్వం తరఫున పక్షాన పట్టుచాదర్‌ను సమర్పించారు. మొదటగా చాదర్‌ను చెరువురోడ్డులోని పాంచ్‌బీబీ దర్గా నుంచి గుర్రపుబండిపై ప్రదర్శనగా బాబయ్యస్వామి దర్గా వద్దకు తీసుకువచ్చారు. అనంతరం మంత్రి చాదర్‌ను తలపై ఎత్తుకొని ముందు నడవగా, దర్గా పీఠాధిపతి తాజ్‌బాబా తదితరులు కలిసి వెళ్లి సమర్పించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొట్టమొదటి సారిగా ప్రభుత్వం తరఫున పట్టుచాదర్‌ను మంత్రి సమర్పించడం పట్ల తాజ్‌బాబా హర్షం వ్యక్తం చేశారు. ఉరుసు సందర్భంగా ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.


దర్గాలో ప్రార్థనలు చేస్తున్న మంత్రి శంకరనారాయణ,
  దర్గా పీఠాధిపతి తాజ్‌బాబా తదితరులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని