logo

‘సీఎస్‌ నివేదిక మాకొద్దు’

పీఆర్‌సీకి సంబంధించిన అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను ఉద్యోగులకు అమలు చేయాలని, సీఎస్‌ నివేదిక మాకొద్దని యూటీఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని యూటీఎఫ్‌ కార్యాలయం ముందు శుక్రవారం సీఎస్‌ నివేదికకు సంబంధించిన నకళ్లను భోగి మంటల్లో

Published : 15 Jan 2022 05:50 IST


సీఎస్‌ రిపోర్టు నకళ్లను మంటల్లో వేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు 

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: పీఆర్‌సీకి సంబంధించిన అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదికను ఉద్యోగులకు అమలు చేయాలని, సీఎస్‌ నివేదిక మాకొద్దని యూటీఎఫ్‌ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని యూటీఎఫ్‌ కార్యాలయం ముందు శుక్రవారం సీఎస్‌ నివేదికకు సంబంధించిన నకళ్లను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. 27 శాతం ఐఆర్‌ ఇస్తూ.. 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడం సరి కాదన్నారు. పాత పద్ధతిలోనే హెచ్‌ఆర్‌ఏను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే సరైన నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జోనల్‌ నాయకులు ఈశ్వరయ్య, నాగరాజు, అర్జున్, తిమ్మప్ప, రాజన్న, ఓబులేసు, గోవిందు, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. 


రాయదుర్గం : ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. 

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన..
రాయదుర్గం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చి మరిచారని మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అన్నారు. పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. 11వ పీఆర్‌సీని మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వర్తింపజేయాలని, ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తిప్పేస్వామి, నాగరాజు, మల్లేష్, రాము, వన్నూరుస్వామి, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని